మామూలు కంటే ముందుగానే నిద్ర లేచా శెలవని మర్చిపోయి స్నానం చెసేసా. మళ్ళా గుర్తొచ్చి తుడిచేసుకున్నాననుకోండి...కాఫీలు, టిఫినీలు అయ్యాకా వారం నుండి పడి ఉన్న పనులన్నీ గుర్తుచెసుకున్నా. ఒకటి కూకటపల్లి, మరొకటి బోయినపల్లి, ఇంకొకటి చిక్కడపల్లి, వేరొకటి లింగంపల్లి. తిరగాల్సినది తల్చుకొని తిరగకుండానే నీరసం వచ్చి శ్రీమతిని టీ పెట్టమని టీవీ ముందు కూర్చున్నా. ఎవరో ఏడుస్తున్నారు, ఏదో సీరియల్ అనుకొంటా..ఛానల్ చేంజ్
యాంకరింగ్ ..
తెలుగమ్మాయే, తెలుగులో మాట్లాడొద్దన్నారేమో..చాలా కష్ట పడుతోంది
ఇంకో ఛానల్..
రేటు చెపితే చీర ఇచ్చేస్తున్నారు.చీరలివ్వడానికే ప్రోగ్రాం పెట్టినట్టున్నారు.
టీవీ కనిపెట్టి చంపుతున్నా, రిమోట్ కనిపెట్టి చాలా మంచి పని చేసారు.
"ఆకలేస్తే అన్నం పెడతా...మూడొస్తే ముద్దులు పెడతా" నంటూ పాట.
ముందు ముద్దులు పెడితే కదా మూడొస్తుంది. ఏమో లెండి.
నాకు మాత్రం ఆకలి గుర్తుకొచ్చింది.
భోజనం చేసి వెళ్దాం లే....
పని పొస్టుపోన్ చెయ్యిడానికి కారణమే కదా మనకు కావాలి.
తిన్నాకా చిన్నకునుకు...అనుకున్నా కానీ పెద్ద కునుకే అయింది.
పనులన్నీ చేసుకొచ్చేసినట్టు...ప్రతీ వారం కనే కలే..
కానీ ఎంత బావుందో!
"ఏమండీ బయటకు వెళ్దాం లేవండీ" శ్రీమతి కుదుపు తో మెలకువ వచ్చింది.
ఏమెళ్తాం లే ట్రాఫిక్ లో..రొటీన్ గా తిప్పికొట్టా
అసలే ఆదివారం వేస్ట్ అయిపొయిందని బాధ.....
ఇంతలో మా ఎటియం (ఎనీ టైమె మందు)గాడ్నుంచి ఫోను
'మందేద్దాం రా'అని...వద్దురా అంటే "ఒక్క పెగ్గే" అన్నాడు
తీరా కూర్చున్నాకా సీసా లో "ఒక్క పెగ్గే" మిగిలింది.
అలవాటైన దారిలో బండే ఇంటికి తీసుకొచ్చింది.
ఏం తిన్నామో పెట్టిన వాళ్ళకే తెలియాలి.
తెళ్ళారాకా .......షరా మమూలే.
1 comments:
ఎందరో జీవితాలలో నిత్యం జరిగె తంతే నండీ ఇదీ
హ హ హ
అసలు కన్నా మందే ముద్దండీ
-----------------
ఆ ఒక్క పెగ్గు నాకు మరి
Post a Comment